Listen to this article

జనం న్యూస్ జూన్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ బడి బాట ‘ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు టి. శ్రీలత బడిబాట కార్యక్రమం కరపత్రం ఆవిష్కరించి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య గూర్చి తెలియజేశారు. అనంతరం శాయంపేట చౌరస్తాలో ఉపాధ్యాయులతో కలిసి ప్రధానోపాధ్యాయురాలు ప్రభుత్వ పాఠశాలల బలోపేతం గూర్చి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత ప్రమాణాలతో విద్యనందిస్తున్నామని ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత పుస్తకాలు అందిస్తూ భోజన సౌకర్యం కల్పిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు పాఠశాలలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో 2025 ఎస్ ఎస్ సి ఫలితాలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన లు ఎన్. అక్షయ, డి. సాయి శ్రీ ,ఎండి. అమ్రీన్ లకు ప్రధానోపాధ్యాయురాలు టి.శ్రీలత ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శేఖర్ బాబు, సుజాత ,లక్ష్మీబాయి ,రేణుక ,గీత, కుమారస్వామి, రంజిత్ కుమార్, విజయలక్ష్మి, విద్యార్థులు, తల్లిదండ్రులు, పేరెంట్స్ కమిటీ మెంబర్స్, పాఠశాల సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు…..