

జనం న్యూస్,జున్ 07,కంగ్టి : సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ కంగ్టి పలు గ్రామాలలో బక్రీద్ పండగ సందర్భంగా శనివారం ఇద్గల వద్ద ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రవక్తలు మాట్లాడుతూ నిబద్థత,విధేయత అనే పదాలకు అర్ధమే కరువవుతున్న నేటి సమాజంలో ప్రజలకు చరిత్రలో వాటి విశిష్టతను తెలియచెప్పే సందర్భాలు కనిపిస్తాయి.వటిలో అత్యంత అరుదైనది ఈద్ ఉల్-అజహాగా పిలిచే బక్రీద్ పండుగ అని అన్నారు. ముఖ్యంగా ముస్లింల చరిత్రలో హద్దుల్లేని త్యాగనిరతికి, అనిర్వచనీయమైన దైవారాధనకు మారు రూపంగా నిలిచే ఓ అరుదైన ఘటనను నేటి తరానికి గుర్తు చేయాలంటే బక్రీద్ పండుగ జరుపుకొని తీరాల్సిందే.ఈ ఘటన గొప్పతనం తెలిస్తే ఈ నాటి సమాజంలో మనం ఎదుర్కొంటున్న ఎన్నో రుగ్మతలకు సమాధానం దొరుకుతుందనడంలో అతిశయోక్తి కాదని అన్నారు. బక్రీద్ పండుగ చరిత్ర. ముస్లింలకు దిశానిర్దేశం చేసేందుకు అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఒకరైన హజరత్ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకొనే పండగ అని అన్నారు.బక్రీద్.ఇస్లాం క్యాలెండర్‌లోని బక్రీద్ మాసంలో 11వ రోజున ఈ పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.ఆధునిక సమాజంలో పేరుకుపోతున్న రుగ్మతల నుంచి జనవాళిని జాగృతపరుస్తూ సన్మార్గంలో నడిపించేందుకు అల్లాహ్ భూమండలానికి 80వేల మంది ప్రవక్తల్ని పంపినట్లు ముస్లింల ఆరాధ్యగ్రంథం దివ్యఖురాన్ చెబుతోందని అన్నారు. వారిలో ఒకరు ప్రవక్త హజరత్ ఇబ్రహీం. అల్లాహ్‌పై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం గడపాలని మానవాళికి బోధిస్తున్న ప్రవక్తల్లోని విశ్వాసాన్ని గ్రహించేందుకు అల్లాహ్ అనేక పరీక్షలతో పరీక్షించేవారు.ఈ క్రమంలో ప్రవక్త ఇబ్రహీం అనేక పరీక్షల్లో తన విశ్వాసాన్ని నిరూపించినట్లు పవిత్ర ఖురాన్ చెబుతుందని అన్నారు. చరిత్రలో అరుదైన త్యాగం. తన ప్రవక్తలను అల్లాహ్ వివిధ సందర్భాల్లో భిన్న రూపాల్లో పరీక్షించేవారు. ఇదే క్రమంలో ప్రవక్త హజరత్ ఇబ్రహీం, ఆయన భార్య హజీరాలకు వారి వృద్ధాప్యంలో సంతానప్రాప్తి కలిగింది. లేక లేక జన్మించిన కుమారుడు ఇస్మాయిల్‌ను వృద్ధ దంపతులు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తరుణంలో ఒక రోజు రాత్రి ఇబ్రహీం తమ కుమారుడు ఇస్మాయిల్‌ను అల్లాహ్‌పేర బలిదానం చేస్తున్నట్లు కలగంటారు. దీంతో అల్లాహ్ తన కుమారుడిని బలిదానం కోరుకుంటున్నారని గ్రహించిన ఇబ్రహీం తన కుమారుడు ఇస్మాయిల్‌ను బలిదానం (ఖుర్బానీ) ఇచ్చేందుకు సిద్ధపడతారు.తండ్రి అంతరంగాన్ని గమనించిన కుమారుడు ఇస్మాయిల్,అల్లాహ్ మార్గంలో బలయ్యేందుకు అంగీకరించారని అన్నారు.బలిచ్చే సమయంలో పుత్రవాత్సల్యం అడ్డువస్తే.తనకు బలి ఇవ్వకుండా తన తండ్రి వెనకడుగు వేస్తే, అల్లాహ్‌తో విశ్వాసఘాతకుడిగా నిలవకుండా,కళ్లకు గంతలతో తనను బలి ఇవ్వమంటూ తండ్రికి సూచిస్తారు.ఆ మేరకు అల్లాహ్ నామస్మరణతో తన కుమారుడిని బలి ఇచ్చేందుకు గొంతుపై కత్తిపెట్టిన క్షణంలో త్యాగ నిరతికి మెచ్చిన అల్లాహ్ ఆఖరు క్షణంలో అల్లాహ్ ఇస్మాయిల్‌ను తప్పించి అదే స్థానంలో ఒక (పొట్టేలు) ను ప్రత్యక్షం చేస్తారు.దీంతో పొట్టేలు గొంతు తెగి అల్లాహ్ మార్గంలో అది ఖుర్బాన్ అయిందని అన్నారు.ఇబ్రహీం త్యాగనిరతిని మెచ్చిన అల్లాహ్ ఆరోజు నుంచి ఈదుల్ అజ్ హా (బక్రీద్) పండగ రోజు జంతు బలి ఇవ్వాలనీ,ఈ విధానాన్ని ప్రళయం వరకు కొనసాగించాలని నిర్దేశించినట్లు ఇస్లాం చెబుతోంది.అలా ఇబ్రహీం ప్రవక్త,ఆయన కుమారుడు ఇస్మాయిల్ ప్రాణత్యాగానికి సిద్దపడిన రోజు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు నేటికీ బక్రీద్ పండుగ జరుపుకుని వారి త్యాగాలను గుర్తు చేసుకుంటుంటారు. త్యాగానికి గుర్తుగా తాము అల్లారు ముద్దుగా పెంచుకున్న మేకలు,పొట్టేళ్లను బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.అలా తాము ఎంతో ఆత్మీయంగా పెంచుకున్న మూగజీవాలను బలి ఇవ్వవలసిన సందర్భంలో త్యాగం విలువ అర్ధమవుతుందని అన్నారు.ఇది భవిష్యత్ జీవితానికీ మార్గదర్శనం చేస్తుందని ముస్లింల నమ్మకం.శతాబ్దాలుగా బక్రీద్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకున్న తర్వాత ఈ బలిదానం చేస్తారు. తద్వారా మానవ జీవితంలో త్యాగనిరతికి ఉన్న ప్రత్యేకతను గుర్తు చేసుకుంటుంటా