

జనంన్యూస్.07. నిజామాబాదు.. ప్రతినిధి. శ్రీనివాస్. ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ ఈ రోజు బక్రీద్ పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఐపీఎస్., నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని ఈద్గాలు మరియు మసీదుల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటులను క్షుణ్ణంగా పర్యవేక్షించినారు.ప్రధానంగా నిజామాబాదు లోని శాంతి నగర్ ఈద్గా మరియు బోధన్ లోని నర్సి రోడ్డు ఈద్గాలు పర్యవేక్షించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు రాకుండా పోలీస్ అధికారులకు సూచించారు.ఈ సందర్బంగా నిజామాబాదు ఏసీపీ శ్రీ రాజా వెంకట్ రెడ్డి, బోధన్ ఏసీపీ శ్రీ పి. శ్రీనివాస్, సి సి ఆర్ బి ఏసీపీ శ్రీ రవీందర్, మరియు సి.ఐ లు, ఎస్సైలు గలరు.