

నిర్భయ ఆర్గనైజేషన్ ఫర్ వుమెన్ మల్లెల ఉషారాణి
జనం న్యూస్ 07జూన్ ( కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి శంకర్ )కల్లూరు పట్టణంలో నిన్న రాత్రి జరిగిన సంఘటన చాలా విచారకరమని హోటల్ వద్ద జరిగిన గొడవను శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా, సద్దు మనుచుట కొరకై వెళ్లిన మహిళ ఎస్సై హరిత పై విచక్షణ కోల్పోయి దాడి జరిగిన సంఘటన సభ్య సమాజంలో చాలా సిగ్గుపడాల్సిన విషయమని,, మహిళా ఎస్సై పైనే ఆ విధంగా దాడి జరిపిన వ్యక్తులను విచారించి, కఠినంగా శిక్షించాలని వారిపై తగిన సెక్షన్స్ ని పెట్టి ఎఫ్ ఐ ర్ ,చేయాలని నిర్ణయార్గనైజేషన్ ఫర్ ఉమెన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు న్యాయవాది మల్లెల ఉషారాణి డిమాండ్ చేశారు ఈ సంఘటనను నిర్భయ ఆర్గనైజేషన్ ఉమ్మడి ఖమ్మం జిల్లాల కమిటీ అధ్యక్షురాలు కే మునిల,,, ఎం శిరీష,, సరిత, విజయలక్ష్మి రాజేశ్వరి, రమ్య, అనూష,,, కమిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు