

జనం న్యూస్ జనవరి 23 శాయంపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గంట శ్యాంసుందర్ రెడ్డి మైలారం గ్రామం మాజీ సర్పంచ్ ఆరికిల్ల ప్రసాద్ మండల ఉపసర్పంచ్ దైనంపల్లి సుమన్ బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ.
ప్రజలకు మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలల కాలం అవుతున్న అప్పటినుండి ఇప్పటివరకు కూడా ప్రజల వద్ద నుండి ప్రజా పాలన అని మండల కేంద్రం నుండి 14 194 దరఖాస్తులు తీసుకున్నారని ఇప్పటివరకు ఏ ఒక్కటి కూడా పరిష్కరించలేదని అదేవిధంగా ఇంటింటి సర్వే అని మరొకసారి ప్రజా పాలన గ్రామసభలు అని ఇప్పుడు అంటూ ప్రజల వద్ద అప్లికేషన్ తీసుకోవడమే తప్ప ప్రజలకు సంక్షేమ పథకాలలో లబ్ధి చేకూర్చిన దాఖలాలు లేవు కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే సంక్షేమ పథకాలలో పేర్లు నమోదు చేస్తూ వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నారు తప్ప ప్రజలను పట్టించుకున్న పోలేదని ఇప్పటివరకు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకం అందలేదని కేవల వాళ్లు కార్యకర్తలను కాపాడుకోడానికే సంక్షేమ పథకాలు పెట్టారని ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు వ్యతిరేకత వస్తుందని కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం కోసమే ప్రజలను అయోమయంలోకి గురి చేస్తున్నారని సంక్షేమ పథకాలకు లబ్ధి చేకూరుస్తలేరు ఇలాంటి చర్యలే చేస్తే రాబోయే కాలంలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా మండల నాయకులు శాయంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు గాజ రాజేందర్ అరికెళ్ల దేవయ్య సోషల్ మీడియా శాయంపేట కన్వీనర్ దైనంపల్లి సుమన్ కరణ్ బాబు కూతాటి రమేష్ గ్రామ కార్యదర్శి ఎండి రాజ్ మహమ్మద్ అరికిల్ల వెంకట్ అర్జల ఆది రెడ్డి దూదిపాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు…..