Listen to this article

జనం న్యూస్ 09 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం జిల్లాలో తొలి కొవిడ్‌ కేసు నమోదైంది. నెల్లిమర్ల మండలానికి చెందిన వ్యక్తి (38) కొంత కాలంగా దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతుండడంతో ఇటీవల మహరాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేరారు. అతనికి సాధారణ వైద్య పరీక్షలతో పాటు, కొవిడ్‌ పరీక్షలను కూడా నిర్వహించారు. శనివారం సాయంత్రం కొవిడ్‌ పాజిటివ్‌ అని రిపోగ్టు వచ్చింది.దీంతో వైద్య అధికారులు అప్రమత్తమై డిశ్చార్జ్‌ చేసి హోం ఐసోలేషన్‌లో ఉంచారు.