

జనం న్యూస్ జూన్ 10, ముడివరం ప్రతినిధి కాట్రేనికోన మండలం
ఈ వేసవి సెలవులు సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో కాట్రేనికోన లో ఫ్రెండ్లీ క్లబ్ వారిచే ఏర్పాటు చేసిన ఉచిత సంగీత శిక్షణ “స్వర కామాక్షి” కార్యక్రమం లో భాగంగా, సంగీత కళాకారిణి శ్రీమతి ఆణివిళ్ళ శ్రీవాణి సుబ్బలక్ష్మి చే శ్రీ తేజస్విని జ్యోతిషాలయం వేదిక గా నెల రోజుల పాటు నిర్వహించిన కార్య క్రమం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా ఫ్రెండ్లీ క్లబ్ సభ్యులు మరియు ఉచిత స్వర శిక్షణ పొందిన బాలబాలికలు శ్రీవాణిని ఘనంగా సత్కరించారని ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాపకుడు ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రి తెలియజేసారు. స్వర వాణి మిత్ర అనే బిరుదు పురస్కార ప్రశంసా పత్రము సుబ్బలక్ష్మికి అందజేసారు. ఈ కార్యక్రమంలో గ్రంధి నానాజీ, తాతపూడి లక్ష్మీ నారాయణ మూర్తి, చెరకు శివయ్య, మల్లాడి రాధాకృష్ణ, కోటిపల్లి నరేంద్ర, శ్రీమతి ఆకొండి సూర్యకాంతం, ఆకొండి లీల, వి. మాధవి, పార్ధు తదితరులు పాల్గొన్నారు.
