Listen to this article

జనం న్యూస్ జూన్ 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

గ్రీన్ కబ్ అనకాపల్లి వారి ఆధ్వర్యంలో శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఆదేశాల మేరకు పల్లి పిలుస్తుంది కదలిరా కార్యక్రమంలో భాగంగా కసింకోట మండలం సోమవారం గ్రామంలో పౌర్ణమి ఏరువాక కార్యక్రమంలో శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు గొంతుని శ్రీనివాసరావు గొంతిన నూకరాజు గొంతిన శివ గ్రీన్ క్లబ్ సభ్యులు కాండ్రేగుల సత్యనారాయణ బేతాళం శేషసాయి రావూరి అనిత తామడ గోవిందరావు గ్రీన్ క్లబ్ వ్యవస్థాపకులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొణతాల ఫణి భూషణ్ శ్రీధర్ నైస్శెట్టి సత్తిబాబు తదితరులు గ్రామంలో వీధుల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ రైతులతో కలిసి ట్రాక్టర్ ను నడుపుతూ పొలంలో ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహించారు.