

(జనం న్యూస్ చంటి జూన్ 11)
ఈరోజు దౌల్తాబాద్ మండలంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మండల పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మధ్యాహ్న భోజన వంట కార్మికులకు స్కావెంజర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అదేవిధంగా పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు పాఠశాలను అనునిత్యం పరిశుభ్రంగా ఉంచుతున్న స్కావెంజర్లు అందరూ కలిసి కలిసికట్టుగా సమన్వయంతో పని చేస్తేనే పాఠశాల వ్యవస్థ విజయవంతంగా కొనసాగుతుందని మన దగ్గరికి వచ్చిన పేద విద్యార్థులకు 100% న్యాయం చేస్తామని సూచించడం జరిగింది రేపు బడులు పున ప్రారంభం కావున ప్రతి పాఠశాలలో పరిశుభ్రత పాఠశాల ఆవరణంలోని పరిశుభ్రత పాటించాలని అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులు వంట పాత్రలు వంట సామగ్రి పరిశుభ్రత పరచుకొని పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మధ్యాహ్న భోజనాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గోపాల్ రెడ్డి, ఆప్జల్ హుస్సేన్, శేషయ్య, బాసీత్, సిబ్బంది పాల్గొన్నారు.

