

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్), జనవరి 23 (జనం న్యూస్): మార్కాపురం: యువనేత రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా మార్కాపురం పట్టణంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. 300 పై యువకులు రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి యువనేత నారా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది అన్నారు కార్యక్రమంలో జనసేన నాయకులు ఇమ్మడి కాశీనాథ్, టిడిపి నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున, యక్కలి కాశీ విశ్వనాథం,తాళ్లపల్లి సత్యనారాయణ,నాలి కొండయ్య యాదవ్, మౌలాలి, కొప్పుల శ్రీనివాస్, జవ్వాజి రామాంజుల రెడ్డి, గుంటక సుబ్బారెడ్డి, ఆలంపల్లి శ్రీనివాసులు, మట్టం వెంకటేశ్వర్లు,ఉడుముల చిన్నప రెడ్డి,పెరుమాళ్ళ కాశీరావు, తడికమళ్ళ బాలుడు, గొట్టం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు