

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్), జనవరి 23 (జనం న్యూస్):- మార్కాపురం: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి స్థానిక బాలుర హై స్కూల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పివి కృష్ణారావు మాట్లాడుతూ దేశంలో జాతీయ నాయకులలో జయంతి ఒక్కటే ఉండి వర్ధంతి లేని నాయకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అడ్డుపెట్టి, విదేశాల్లో స్వంత సైన్యం ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలను కొనసాగించాలని కోరారు. ప్రతి ఒక్కరు కూడా దేశభక్తి జాతీయ భావాలు కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ కౌన్సిల్ మెంబర్ శాసనాల సరోజిని, బొంతల కృష్ణ, ఎం. చిన్నయ్య, మద్దెల లక్ష్మి, దేవిశెట్టి చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షులు పాదర్తి ఆంజనేయులు, సతీష్, బి అనిల్ కుమార్, చిన్న సత్యం, వాసవి ప్రియ, డి కాసిం తదితరులు పాల్గొన్నారు.