Listen to this article

జనం న్యూస్ 14 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో తల్లికి వందనం విడుదల చేయాలని కాంప్లెక్స్ నుండి మయూరి జంక్షన్ మీదుగా మరల కాంప్లెక్స్ వరకు నిర్వహించి అనంతరం కాంప్లెక్స్ ఎదురుగా మనవహరం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి.రాము మాట్లాడుతూ
కూటమీ ప్రభుత్వం తల్లికి వందనం నిధులు జూన్ 12 కి విడుదల చేస్తామని వచ్చే నెలకి దాటవేయడం సరికాదన్నారు. అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం అమ్మ ఒడిలో అనేక షరతులు పెట్టిందని మా ప్రభుత్వం అధికారంలోకొస్తే ఎటువంటి షరతులు లేకుండా అందరికీ 15000 రూపాయలు తల్లికి వందనం ఇస్తామన్న హామీ ఏమైంది అన్నారు. కూటమి నాయకులు ఏడాది పాలనలో హామీలు అమలు చేసాము అని ప్రగల్భాలు పలుకుతున్నారని ఇది రాష్ట్ర ప్రజలను మోసం చెయ్యటం తప్ప మరొకటి కాదని విమర్శించారు.
తల్లికి వందనం పథకంలో విద్యార్థికి 13 వేలు మాత్రమే జమ చేస్తున్నారని ,2 వేలు స్కూళ్లు, కాలేజీల అభివృద్ధి పనుల కోసం మినహాయింపు ఇస్తున్నారు. అలాగైతే మరి ప్రైవేట్, కార్పొరేట్ విద్యార్థుల నుండి ఎందుకు వసులు చేయడం. దీనికి బదులు 13000 రూ లే ప్రకటించ వచ్చు కదా అని దుయ్యబట్టారు. దానితో పాటు అనేక అసంబద్ధ నిబంధనల పేరుతో విద్యార్థుల సంఖ్యను కుదింపు చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. కరెంటు 300 యూనిట్లు వినియోగిస్తే అర్హులు కారు అనే నిబంధనను గతంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యతిరేకించారనీ మరి ఇప్పుడు అతనే మరల అదే నిభందనలను కొనసాగిస్తున్నారు అని తెలిపారు. ఆ నిబంధన తొలగించాలని కోరారు. దానితో పాటు ఫోర్ వీలర్ వెహికిల్ నిబంధనను తీసివేయాలి అని డిమాండ్ చేశారు. ఒక కుటుంబంలో పాఠశాల, డిగ్రీ చదివే విద్యార్థులు ఉంటే.. ఒక్కరికి మాత్రమే ఏదైనా పథకం వర్తిస్తుంది. ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం నేడు ఫీజు రీయింబర్స్ మెంట్ కు లింక్ పెట్టడం సరికాదు అని తెలిపారు. ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఎటువంటి షరతులు లేకుండా తల్లికి వందనం అందరికి 15000 చొప్పున ఇవ్వాలని లేని పక్షంలో తల్లిదండ్రులు, విద్యార్థులను ఐక్యం చేసి పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శలు ఎం. వెంకీ, పి.రమేష్, రాజు జిల్లా ఉపాధ్యక్షులు సి.హెచ్ వంశీ, ఆర్. శిరీష, ఎస్ సోమేష్ జిల్లా నాయకులు భారతి, రమణ, నాని, జగదీష్, మురళి,చైతు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.