

జనం న్యూస్. తర్లుపాడు మండలం జూన్ 16
తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో గల ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో గల విద్యుత్ స్తంభం ఆదివారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు విద్యుత్ స్తంభం విరిగింది, పక్కనే ఉన్న చెట్టు విరిగి విద్యుత్ తీగలపై పడటం తో స్పార్క్స్ వెలుబడ్డాయి విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ లైన్ మెన్ నాగరాజు విద్యుత్ ని నిలిపి వేసి, విరిగిన స్తంభం వలన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ప్రత్యన్యాయ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు