

జనం న్యూస్ జూన్ 16
వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు హైస్కూల్ మరియు ప్రైమరీ స్కూల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు మరియు స్కూల్ యూనిఫామ్ పంపిణీ చేసిన రాపోలు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గండు వెంకటేష్. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఉప్పరి రాకేష్, ZPHS హెడ్మాస్టర్ రమేష్, ప్రైమరి స్కూల్ హెడ్మాస్టర్ యాదమ్మ, గ్రామ నాయకులు గండు రాధాకృష్ణ, కళ్యాణ్, ఎం యాదయ్య, గ్రామ సెక్రెటరీ బుచ్చయ్య, స్కూల్ స్టాప్, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.