

జనం న్యూస్ జూన్ 17 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పద కొండు సంవత్సరాల విజయవంతమైన పాలనను పురస్కరించుకొని ఈరోజు బాలాజీ నగర్ డివిజన్‌లోని కె.పి.హెచ్.బి కాలనీ రోడ్ నం రెండు లో ధనలక్ష్మి గ్రౌండ్ ప్రాంగణంలో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం గ్రౌండ్‌ను పర్యవేక్షించిన ఆయన అక్కడ వ్యాయామం చేస్తున్న వారిని అభినందించి, మొక్కల ప్రాముఖ్యతను మరియు పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్రను వివరించారు. ఆరోగ్య రీత్యా వ్యాయామం అవసరాన్ని వాకర్లకు మరియు కార్యకర్తలకు వివరించారు. తరువాత పార్టీ కార్యకర్తలతో కలిసి “చాయ్ పే చర్చ” కార్యక్రమంలో పాల్గొని, ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో దేశం సాధించిన అభివృద్ధి, బీజేపీ విధానాలు, భవిష్యత్ లక్ష్యాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో కూకట్ పల్లీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు, డివిజన్ అధ్యక్షుడు జి.వినోద్ గౌడ్, ప్రధాన కార్యదర్శిలు ఆకుల రాము వేణుగోపాల్, సీనియర్ నాయకులు భగవంత్ రెడ్డి, సూరిబాబు, వెంకటరమణ, డివిజన్ నాయకులు లక్ష్మి నాగేశ్వర్ గుప్తా, టి.పవన్ తదితరులు పాల్గొన్నారు.
