Listen to this article

భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు

భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ

జనం న్యూస్ జూన్ 18(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

భూ భారతి పేరుతో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకుని పెండింగ్ లో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించుకోవాలని,భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను భూ సమస్యలు ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోదాడ ఆర్డివో సూర్యనారాయణ అన్నారు. మంగళవారం మునగాల మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు..భూ సమస్యలు పరిష్కరించి,రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తోందని తెలిపారు. భూ రికార్డులలో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్స్ లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్-బిలో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు సదస్సులలో స్వీకరించి భూభారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి,నిర్దేశిత గడువు లోపు సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.