

నందికొండ మున్సిపాలిటీ 4వ వార్డులో చెత్తను తొలగించిన మున్సిపల్ సిబ్బంది
జనం న్యూస్- జూన్ 17- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ –
జనం న్యూస్ దినపత్రికలో ప్రచురితమైన నందికొండ మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు శూన్యం అనే కథనానికి స్పందిస్తూ మున్సిపల్ అధికారులు, కార్మికులు ఈరోజు స్థానిక నాలుగవ వార్డులోని చెత్త చెట్ల కొమ్మలను ట్రాక్టర్ తో తొలగించి శుభ్రపరిచారు.