

ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్జనం
న్యూస్,జూన్17,అచ్యుతాపురం: యలమంచిలి
నియోజకవర్గ కేంద్రమైన యలమంచిలిలో ఇక పై ప్రతి బుధవారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ తెలిపారు. జిల్లా పరిషత్తు గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఛాంబర్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఇప్పటివరకు మండలాల వారీగా నిర్వహించే జనవాణి కార్యక్రమం, బుధవారం నుండి నియోజకవర్గ నాలుగు మండలాలకు ఎలమంచిలి కేంద్రంలోని నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ విషయాన్ని నియోజకవర్గ ప్రజలందరూ గమనించి తమ సమస్యలపై ఫిర్యాదులు ఇవ్వదలచిన వారు ఎలమంచిలి జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్లోని మ్మెల్యే ఛాంబర్ కు రావాలని ఎమ్మెల్యే విజయ్ కుమార్ కోరారు.