

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి
. జనం న్యూస్.జూన్ 17, 2025:(ఆసిఫాబాద్ )కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.
జిల్లాలోని ఆదివాసి, గిరిజన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. మంగళవారం జిల్లాలోని జైనూర్ మండలం ఆశ పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి జన జాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్ (పి.ఎం. జుగా) శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి శిబిరంలో అందుతున్న సేవలు, లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఆదివాసి, గిరిజన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందించేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం లెంటిగూడ గ్రామాన్ని సందర్శించి ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసి న్యాయమహా అభియాన్ (పి.ఎం. జన్ మన్) మొబైల్ మెడికల్ వాహనాన్ని పరిశీలించారు. ఈ వాహనం ద్వారా గిరిజన ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. వివాహనం ద్వారా అందిస్తున్న వైద్య సేవలు, రోగుల వివరాలు తెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేశారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెడికల్ వాహనం ద్వారా మారుమూల ప్రాంతాల గిరిజనులకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని, అవసరమైన చోట మరింత మెరుగైన సేవలు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.