

జనం న్యూస్ జూన్ 17:
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో నియమించబడిన స్కావెంజర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమును మంగళవారం రోజునా ఎంఈఓ ఆనంద్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ప్రభుత్వ పాఠశాలలో శానిటేషన్ కి సంబంధించినటువంటి పనులను పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఏ విధంగా ఉంచుకోవాలి అనే విషయాన్ని జిల్లా స్థాయిలో ఒకరోజు శిక్షణకు డి ఆర్ పి గా హాజరైన జెడ్పిహెచ్ఎస్ తడపాకల్ పాఠశాల సోషల్ ఉపాధ్యాయులు భూపతి మండల కార్యక్రమం లో వివరించడం జరిగింది.. ఈ సమావేశం లో అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పాటు ప్రతి పాఠశాల ఒక ఉపాధ్యాయుడు అలాగే స్కావెంజర్లు హాజరు కావడం జరిగింది.
