

జనం న్యూస్ జూన్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి మండలం, వెంకు పాలెం గ్రామంలో, వరి విత్తనాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ద్వారా ప్రతి మండలంలో రైతు సేవా కేంద్రం ద్వారా వరి విత్తనాలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని, మన అనకాపల్లి మండలంలో రైతులకు కావలసిన వరి విత్తనాలు రైతు సేవ కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని ఆర్జెల్లు RGL-2537,BPT-5204 సాంబ మసూరు,MTU-1224,MTU-1262 ఒంటి మంచి రకాల సిద్ధంగా ఉన్నాయని కావలసిన రైతులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని, ఎరువులు,పురుగు మందులు వంటివి రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు, మన శాసనసభ్యులుఆధ్వర్యంలో వెంకుపాలెం, సీతానగరం, సుంద రయ్యపేట ఒంటి గ్రామ రైతులకు వరి విత్తనాలు పంపిణీ ఎమ్మెల్యే చేతుల మీద గా వరి విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది,అదేవిధంగా గ్రామ పెద్దలు, గ్రామ రైతులు, గ్రామ యువకులు మాట్లాడుతూ వెంకుపాలెం, సీతానగరం, మరియు కొంచంగి గ్రామాలలో ఎదురుగడ్డలో తుప్పలు, మట్టి, కూరుకుపోయి ఉన్నాయని వీటిని వర్షాలు ప్రారంభం అవ్వకముందే ఇక తుప్పల్ని వాటిని శుభ్రపరచాలని ఎమ్మెల్యే కి చుట్టుపక్కల రైతులు వారి యొక్క బాధను వినిపించుకున్నారు, అనంతరం వెదుర్లగడ్డని సదర్శించడం జరిగింది ,ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు చదరం నాగేశ్వర రావు, తుమ్మపాల మాజీ సర్పంచ్ కర్రి బాబి మాజీ జడ్పిటిసి భర్త్ బాబు సీతానగరం, వెంకుపాలెం ,సుందరి పేట, కూటమి నాయకులు వ్యవసాయ సహాయ సంచాలకులు, ఏడిఏ ఎం.రామారావు మరియు మండల వ్యవసాయ అధికారి పి. రంగాచారి వెంకుపాలెం, బుద్ధ చిరంజీవి మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ నాయకులు గ్రామ పెద్దలు, గ్రామ రైతులు ఈ సందర్భంగా పాల్గొన్నారు.