Listen to this article

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే

జనం న్యూస్ జూన్ 17 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

ప్రభుత్వ విద్యా సంస్థల ద్వారా విద్యార్థులకు విలువలు కలిగిన గుణాత్మక విద్య అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ ఛాంబర్ లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల-మంచిర్యాల లో అడ్మిషన్లకు సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నూతనంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ ప్రాంత బాలికల కొరకు తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ గురుకుల కళాశాలలో నాణ్యమైన విద్య రుచికరమైన భోజనము విద్యను అభ్యసించడానికి కావలసిన అన్ని రకాల సదుపాయాలు, ఉపాధి పొందడానికి ఇంటర్న్ షిప్, ప్లేస్ మెంట్ సెల్, ఉన్నత విద్య కొరకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించబడతాయని తెలిపారు. 2025 సంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అడ్మిషన్లు పొందాలని వివరాలకు 7995010674 నెంబర్ లో సంప్రదించాలని తెలిపారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. జి. అనూష, అధ్యాపకులు పాల్గొన్నారు