

జనం న్యూస్ జూన్ 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఎటిఎం సెంటర్ ల వద్ద డబ్బులు తీసుకోవడానికి వచ్చే అమా యకులను సహాయం చేసినట్లు నటించి,మోసం చేసి వారి వద్ద నుండి ఎటిఎం కార్డులు లను మార్చి నకిలీ ఎటిఎం కార్డులు ఇచ్చి డబ్బులను విత్ డ్రా చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ఇరువురు వ్యక్తులను అమలాపురం పట్టణ పోలీసులు అరెస్టు చేసారు..అమలాపురం టౌన్ పోలీసు స్టేషన్ పరిదిలో పలు ఎటిఎం సెంటర్ లలో, డబ్బులను తీసుకోవడానికి వచ్చే వారిని ఏదో విధంగా మభ్య పెట్టి, వారి పిన్ ను చూడడం గాని, డబ్బులు తీసుకోవడం రాని వారి వద్ద నుండి పిన్ ను తెలుసుకొని ముద్దాయులవద్ద ఉండే నకిలీ ఎటిఎం కార్డును వారికి ఇచ్చి, వారి అసలు ఎటిఎం దొంగిలించి దానితో వారి అకౌంట్ లో ఉండే డబ్బులను విత్ డ్రా చేసి ఆ డబ్బులను దొంగతనాలకు పాల్పడుతున్న కొంతమూరు కు చెందిన పల్లా సురేంద్రకుమార్, విజయనగరం జిల్లా బొబ్బిలి కి చెందిన తాడ్డి లక్ష్మణరావు లను పోలీసులు అరెస్ట్ చేశారు..వారి వద్ద నుండి అమలాపురం టౌన్ పోలీసు స్టేషన్ 7,
ముమ్మిడివరం-1,రావులపాలెం-1,నగరం-1,పామర్రు-1 రామచంద్రపురం-1,ఆత్రేయపురం పి.యస్-2,
తణుకు-1 లకు సంబందించి, 15 కేసులు లలో మొత్తం రు.5 లక్షల నగదు, 24 నకిలీ ఏటిఎం కార్డ్ లను స్వాధీనం చేసుకున్నట్లు అమలాపురం, డి.యస్.పి. టి.యస్.ఆర్. కె ప్రసాద్ తెలిపారు…పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి. వీరబాబు, క్రైమ్ ఇన్స్పెక్టర్ గజేంద్ర కుమార్ నేతృత్వంలో, అమలాపురం టౌన్ యస్.ఐ కిషోర్ బాబు, స్టేషన్ సిబ్బంది, క్రైమ్ ఏఎస్ఐ బాలకృష్ణ.,క్రైమ్ సిబ్బంది సహాయంతో సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు అమలాపురం డి.ఎస్.పి టి.యస్.ఆర్.కె ప్రసాద్ తెలిపారు.