

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జూన్ 19
తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ వలి ప్రకాశంజిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ప్రధానకార్యదర్శిగా నియమితులు అయిన సందర్భంగా అభినందన కార్యక్రమం తుమ్మలచెరువు గ్రామం లో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా విచ్చేసి జిల్లామైనారిటీ ప్రధానకార్యదర్శిని శాలువతో సత్కరించి అభినందించారు అనంతరం జిల్లాఅధ్యక్షులు షేక్ సైదా మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై ఎస్ షర్మిల అవ్వడం కచ్చితం అని అన్నారు, రేపు ఒంగోలు లో జరగబోయే ర్యాలీకి తర్లుపాడు మండలం లోని అన్ని గ్రామాల్లో గల కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలనీ పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమం లో జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిఅధ్యక్షులు మహబూబ్ వలి, మహిళా అధ్యక్షురాలు షాజహాన్, తర్లుపాడు మండల అధ్యక్షులు షేక్ హుస్సేన్, మార్కాపురం టౌన్ అధ్యక్షులు మహబూబ్ వలి కార్యకర్తలు పాల్గొన్నారు
