Listen to this article

జనం న్యూస్ తర్లుపాడు మండలం జూన్ 19

తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని మార్కాపురం డిడిఓ బి బాలు నాయక్ అకస్మికంగా సందర్శించారు అనంతరం మండలం లోని పంచాయితీ కార్యదర్సులకు, వెల్ఫేర్ అసిస్టెంట్ లకు, డి ఏ లకు అత్యవసర సమావేశం నిర్వహించారు, డిడిఓ బాలునాయక్ మాట్లాడుతూ గ్రామ సచివాలయ సిబ్బంది సమయపాలన పాటిస్తూ గ్రామ అభివృద్ధి కీ తొడ్పడాలని, సంక్షేమ పధకాల విషయం అర్హులైన ప్రతి ఒక్కరికి అందేల చూడాలని, తల్లికి వందనం, ఈకెవైసి, రేషన్ కార్డు కొరకు వచ్చిన ప్రతి ఒక్క లబ్ది దారుడికి ఎటువంటి సమస్య లేకుండా వెంటనే స్పందించి పనులు చేయాలనీ, మరీ ముఖ్యంగా అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్బంగా జూన్ 21 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది యోగాంద్ర రిజిస్ట్రేషన్ చేపించాలని, యోగాంద్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలనీ కోరారు ఈ కార్యక్రమం లో డిఎల్ పి ఓ భాస్కర్ రెడ్డి, ఎంపీడీఓ బుర్రి చంద్రశేఖర్,ఈపిఓఆర్డీ టి సుకుమార్, సీనియర్ అసిస్టెంట్ కోటిరెడ్డి, టైపిస్ట్ రమణ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ రాజశేఖర్ రెడ్డి, పంచాయితీ కార్యదర్సులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు