

జనంన్యూస్. 19.నిజామాబాదు.
11 సంవత్సరాల విజయవంతమైన నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరియు రైతులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని వ్యవసాయ ఆధారిత రంగాలను కూడా అభివృద్ధి పథంలో నడిపించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నదని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్ వ్యాఖ్యానించారు బిజెపి అర్సపల్లి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్వామి యాదవ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డులు, మరియు ప్రధానమంత్రి కిసాన్ సన్ యోజన వంటి ఎన్నో పథకాలను రైతు సంక్షేమం కోసం ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించింది అన్న విషయాన్ని గుర్తు చేశారు. పీఎం కిసాన్ సన్మాన్ నిధి ద్వారా రైతుల పెట్టుబడి ఎకరానికి ₹6000 వార్షిక సహాయం ₹3.7 లక్షల కోట్ల పంపిణీ రైకాంగానికి చేయూత ,కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా 7 కోట్లకు పైగా రైతలకు ₹10 లక్షల కోట్ల క్రెడిట్ మద్దతు 2014లో 3 నుండి 2024లో 24కి పెరిగిన మెగా ఫుడ్ పార్కుల అభివృద్ధిని ఈ సందర్భంగా ఆయన రైతులతో ప్రస్తావించారు. పంట నష్టము జరిగిన కూడా రైతులకు ఇబ్బంది కాకుండా ఫసల్ బీమా యోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఎరువులు విత్తనాల కొరతతో రైతులు నానా అవస్థలు పడే రోజులు పోయి నీమ్ కోటింగ్ యూరియాతో రైతులు నిశ్చింతగా అక్రమార్కుల బారి నుంచి బయటపడ్డారని, యూరియా పక్కదారి పట్టణం పూర్తిగా నిరోధించబడిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతమైన పథకాల ద్వారా రైతులకు, రైతు కూలీలకు, వ్యవసాయ ఆధారిత రంగాలలోని వ్యక్తులకు అభివృద్ధి ఫలాలను అందించడం కోసం కృషి చేస్తున్నదని, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి రైతులు దేశవ్యాప్తంగా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలియజేశారు.11 సంవత్సరాల విజయవంతమైన పరిపాలన మీద నిర్వహిస్తున్న ఈ రచ్చబండ కార్యక్రమాలలో అన్ని రంగాల ప్రజలు తమ యొక్క మద్దతును తెలుపుతున్నట్టు, అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్ అన్నారు. ఓబిసి మోర్చా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు నిజామాబాద్ జిల్లాలోని అన్ని మండలాలలో ఈ రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల నాయకులు కోర్వ రమేష్, తోడేల నవీన్, గంగాధర్, జగన్, మారుతీ, పారశురాం, సత్యనారాయణ, రాజకుమార్ (ఓబీసీ ఐటీ సెల్ అర్బన్ కన్వినర్)
మరియు అర్సపల్లి గ్రామ రైతులు ముచ్కూర్ హనుమండ్లు, చీమల రాజు,నాయక్వాడి సుధాకర్, శ్యామ్ రావు, శివరాం,తదితరులు పాల్గొన్నారు.