Listen to this article

కాంగ్రెస్ పార్టీ నాయకులు

జనం న్యూస్ 19 జూన్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)

ఎల్కతుర్తి మండల కేంద్రంలోని జిలుగుల గ్రామంలో ఘనంగా ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తౌటం నరేందర్ ఆధ్వర్యంలో, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జిలుగుల బస్టాండ్ వద్ద కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పక్షాన రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తౌటం నరేందర్ మాట్లాడుతూ; దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి చెందిన నాయకుడు, 150 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి నాలుగవ తరం వారసులు రాహుల్ గాంధీ అని కొనియాడారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన 75 యేళ్లలో దాదాపు 50 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించిందని అన్నారు. రాహుల్ గాంధీ 2004లో భారత రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా గెలిచి, ఆ తదుపరి ఎఐసిసి అధ్యక్షులుగా యువ నాయకత్వాన్ని వహించారన్నారు. భారత్ జోడో యాత్ర పేరిట కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు 3500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి, అదే విధంగా న్యాయ యాత్ర ద్వారా పేద అట్టడుగు వెనుకబడిన ప్రజల కోసం ప్రజాస్వామ్యాన్ని తిరిగి పొందడానికి జై భీమ్, జై బాపు, జై సంవిదాన్ అనే కార్యక్రమంతో ప్రజలకు రాజ్యాంగం యొక్క గొప్పతనం తేలవాల్సిన అవసరం ఉందని, దాని కోసం ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. రేపటి ఉజ్వల భవిష్యత్తు కోసం భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడు రాహుల్ గాంధీ అని రానున్న రోజుల్లో ఈ దేశ ప్రజల ఆశీర్వాదంతో వారిని ప్రధానమంత్రిగా చూడబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు గూటం జోగిరెడ్డి, రావుల రమేష్, మాజీ ఉప సర్పంచులు తంగేళ్ల ప్రవీణ్ కుమార్, ముచ్చ బుచ్చిరెడ్డి, నాయకులు ముచ్చ తిరుపతి రెడ్డి, బిల్లా ప్రభాకర్, కుక్కల రాయమల్లు, ముష్కే రవి వర్మ, మిరియాల మల్లారెడ్డి, గూటం సమ్మిరెడ్డి, ఆరేపల్లి ప్రభాకర్, ఆరెపల్లి సారయ్య, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.