

టి.జి.డబ్ల్యూ.ఆర్.ఎస్. బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జి.యాదగిరి
జనం న్యూస్ జూన్ 19 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
దైనందిన జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని, యోగాను కొంత సమయం కేటాయించుకోవాలని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని టి.జి.డబ్ల్యూ.ఆర్.ఎస్. & బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జి.యాదగిరి అన్నారు. గురువారం అంతర్జాతీయ యోగా దశాబ్ది వేడుకలు పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని టి.జి.డబ్ల్యూ.ఆర్.ఎస్. బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహించిన యోగ, ఆయుర్వేదిక్ వైద్య శిబిరానికి అడ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యురాలు శిల్పా మోహన్ తో కలిసి హాజరయ్యారు సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఆరోగ్యానికి మించిన సంపద లేదని, ప్రతి ఒక్కరు నిత్యం యోగా కొరకు కొంత సమయం కేటాయించుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. ఇందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో ఆయుష్ సిబ్బంది శంకర్ గౌతమి యోగా శిక్షకులు జీవన్ పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు
