Listen to this article

జనం న్యూస్ 19జూన్ ( కొత్తగూడెం నియోజకవర్గం కురుమెల్ల శంకర్)

జిల్లాలోని దివ్యాంగులకు సహాయ ఉపకారణంలో కొరకు అర్హులైన వారి నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవడానికి ఈ నెల 27 వరకు పొడిగించినట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి జేఎం స్వర్ణలత లెనిన్ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారు రిట్రో ఫిట్టేడ్ మోటార్ వాహనాలు , బ్యాటరీ వీల్ చైర్లు మొబైల్ బిజినెస్ బ్యాటరీ వీల్ చైర్లు బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటో హైబ్రిడ్ వీల్ చైర్ లాప్టాప్స్ టాప్స్ , 5G స్మార్ట్ ఫోన్ మరియు ట్రై సైకిల్ వీల్ చైర్లు వినికిడి యంత్రాలు కొరకు ఆన్లైన్ ద్వారా https://tgobmms.cgg.gov.in దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు, అర్హతను అనుసరించి సహాయ ఉపకరణముల కొరకు ఈనెల 27లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చేసుకున్న దరఖాస్తులను జిల్లా సంక్షేమ శాఖ అధికారి మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం IDOC G1 నందు దరఖాస్తులు అందించవలసిందిగా పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారు ఇతర వివరముల కొరకు
63019 81960 83310 06010.