

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 20 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం సాగర
తీరంలో పెద్ద ఎత్తున చేపడుతున్న యోగాంధ్ర కార్యక్రమంను విజయవంతం చేసేందుకు అధికారులు మరియు ఇతర సిబ్బంది నిర్వహించాల్సిన బాధ్యతలపట్ల అవగాహన కల్పించేందుకు జూన్ 19న యోగాంధ్ర ట్రయల్ రన్ నిర్వహించినట్లు గా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – యోగాంధ్ర కార్యక్రమ నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇన్చార్జ్లుగా నియమించే అధికారులు, భద్రత విధులు నిర్వహించే
పోలీసు అధికారులు, సిబ్బందికి వారు నిర్వహించాల్సిన విధులు, బాధ్యతలు పట్ల అవగాహన కల్పించేందుకు ముందస్తుగా యోగాంధ్ర ట్రయల్ రన్ నిర్వహించామన్నారు. విశాఖ ఐటి సెజ్ నుండి కాపుల ఉప్పాడ వరకు ఏర్పాటు చేసిన 59 కంపార్టుమెంట్లలో పాల్గొనేందుకు వచ్చే ప్రజలు బస్సుల్లో ఏవిధంగా, ఏ రూట్ లో చేరుకోవాలి, వాహనాలను ఎక్కడ పార్కింగు చేసుకోవాలి, బస్సులో ప్రయాణించిన ప్రజలు ఏ కంపార్టుమెంటుకు, ఎలా చేరుకోవాలన్న విషయాలు గురించి జిల్లా ఎస్పీ మరియు ఇతర అధికారులు ఆయా బస్సులు, కంపార్టుమెంటు ఇన్చార్జ్ అధికారులకు అవగాహన కల్పించారు. యోగా కార్యక్రమం ముగిసిన తరువాత ప్రజలు తిరిగి పార్కింగు స్థలాలకు ఏవిధంగా చేరుకోవాలి, ఆయా బస్సులు ఏవిధంగా వారి గమ్య స్థానాలకు చేరుకోవాలన్న విషయాలపట్ల అవగాహన కల్పించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా
పోలీసు అధికారులు, సిబ్బంది చేపట్టాల్సిన చర్యలు గురించి జిల్లా ఎస్పీ దిశా నిర్ధేశం చేసారు. విజయనగరం నుండి 16 బస్సుల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు, లైజన్ అధికారులు సాధారణ ప్రయాణికుల వలే పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించి, గమ్య స్థానాలకు చేరుకోగా, వారితోపాటు జిల్లా ఎస్పీ మరియు ఇతర పోలీసు అధికారులు కూడా ఆయా బస్సుల్లో ప్రయాణించి, బస్సులను నిలిపే పార్కింగు స్థలాలు, యోగాలో పాల్గొనేందుకు కేటాయించిన కంపార్టుమెంట్లును స్వయంగా పరిశీలించి, ఇన్చార్జ్ అధికారులకు ప్రత్యక్షంగా చూపడమైనదన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనే 660 బస్సుల్లో జిల్లా నుండి ప్రజలు సముద్ర తీర ప్రాంతానికి రానున్నందున ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని, ప్రతీ ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని, అధికారుల
సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ, వ్యవహరించాలని, నియంత్రణ చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి, జిల్లా కలెక్టరు డా.బి.ఆర్.అంబేద్కర్, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఎపిఎస్పీ బెటాలియన్ ఐజిపి బి.రాజకుమారి, పలువురు రెవెన్యూ ఉన్నతాధికారులు మరియు ఇతర పోలీసు అధికారులు కంపార్టుమెంట్లును, పార్కింగు స్థలాలను స్వయంగా సందర్శించి, అక్కడ విధులు నిర్వహించే అధికారులు,సిబ్బందికి దిశా నిర్ధేశం చేసారు.
ఈ కార్యక్రమంలో ఎపిఎస్పీ ఐజిపి బి.రాజకుమారి, జిల్లా కలెక్టరు డా.బి.ఆర్. అంబేద్కర్, జిల్లా ఎస్పీ వకుల్ జీందల్, రెవెన్యూ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, ఎఆర్ ఎస్పీ అశోక్ కుమార్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, పలువురు డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.