

జనం న్యూస్ 20 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
ప్రముఖ సామాజిక సేవా సంస్థ వసుధా ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకట రామ రాజు ఈ రోజు విజయనగరం లో శాసన సభ్యులు పూసపాటి అతిధి గజపతి రాజు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ లను గౌరవ ప్రదంగా కలిశారు అనంతరం క్షత్రియ పరిషత్ విజయనగరం జిల్లా సహకారం తో మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు శాసన సభ్యులు అదితి గజపతి తో కలిసి మహారాజా ఆసుపత్రి మరియు ఘోషా ఆసుపత్రి లను సందర్శించి ముప్పై లక్షల రూపాయలు విలువచేసే ఆసుపత్రికి కావలసిన 13 రకాల వైద్య పరికరాలు ఆసుపత్రి సూపరింటెండెంట్ లకు అందించారు అనంతరం విజయనగరం ఇలవేల్పు పైడితల్లి అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందారు అశోక్ బంగ్లా లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో మాజీ శాసన మండలి సభ్యులు పాకలపాటి రఘువర్మ క్షత్రియ పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు పెనుమత్స సీతా రామరాజు సాగి సీతా రామ రాజు తో కలిసి నిరుపేద విద్యార్థుల చదువు కోసం 45000/- రూపాయలు నగదు పంపిణీ చేసారు ఈ సందర్భం గా మంతెన వెంకట రామ రాజు మాట్లాడుతూ విజయనగరం లో విద్యా వైద్య రంగాల కృషి కి తానెప్పుడూ ముందుంటాను అని ఇంకా భవిష్యత్ లో చాలా సేవా కార్యక్రమాలు చేయటానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు పూసపాటి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ వసుధ ఫౌండేషన్ కార్యక్రమాలకి విద్యా రంగం లో మాన్సాస్ సంస్థ తరపున పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమం లో క్షత్రియ పరిషత్ క్షత్రియ యూత్ పరిషత్ కార్యవర్గ సభ్యులు పాల్గొని వెంకట రామ రాజు అశోక్ అదితి రఘువర్మ లను సన్మానించారు