

జనం న్యూస్ జూన్ 20 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ. మియాపూర్ బ్రాంచ్ ఖాతాదారుల సమావేశం గురువారం మియాపూర్ బ్రాంచ్ లో జరిగినది ఈ సమావేశానికి సొసైటీ చైర్మన్ వీ ఆర్ వి పి ఎస్ రాజు డైరెక్టర్లు మనసాని సీనయ్య, ఏ సోమలింగం గౌడ్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మన్నే నరేంద్ర కుమార్ హాజరయ్యారు. మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఖాతాదారులు అందరు సహకారంతోనే సొసైటీ 4450 కోట్లు టర్నో వర్ తో లక్ష పదివేల మంది సభ్యులతో ఆరు రాష్ట్రంలో నలబై రెండు శాఖలతో పనిచేస్తుందని అన్నారు దేశంలోనే టాప్ ఐదు మల్టీస్టేట్ కోఆపరేటివ్ సొసైటీలలో ఒకటిగా కొనసాగుతూ అందరి మన్ననలు పొందుతుంది అని అన్నారు. ఈ సభ్యుల సహకారంతో మరింత ముందుకు సాగుతూ అత్యధిక లాభాల బాటలో పయనిస్తుంది అని సొసైటీ చైర్మన్ రంగరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ బ్రాంచ్ మేనేజర్ మురళీకృష్ణ, మేనేజర్లు జీ తాతాజీ, నరేంద్ర మరియు స్టాఫ్ సుమతి, గణేష్, సుమంత్, మోహన్ పాల్గొన్నారు.