Listen to this article

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో

భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలి విద్యార్థులు అసాంఘిక శక్తులకు దూరముగా ఉంటూ మంచిని మార్గం ఎంచుకొని సమాజ శ్రేయస్సుకు పాటు పడాలిఎస్సై కే శ్వేత

జనం న్యూస్ జూన్ 20( భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి)

భీమారం మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ విద్యాలయం నందు శుక్రవారం రోజున భీమారం మండల ఎస్ ఐ కే శ్వేత మాట్లాడుతూ ట్రాఫిక్ నియమా నిబంధనల పై అవగాహన కల్పిస్తూ విద్యార్థులు చెడువ్యసనాలకు అలవాటు కాకుండా భవిష్యత్‌పై దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు. .దేశ భవిష్యత్తుకు కేంద్ర బిందువు విద్యార్థులు అన్ని విద్యార్ధులు, చదువుపై దృష్టి పెట్టి ఉన్నత స్ధాయిలో నిలిచి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలన్నారు విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి మార్గంలో నడిచి తమ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని విద్యార్థులు గంజాయి,మద్యం,జూదం వంటి చెడు వ్యసనాలకు,ఇతర చెడు మార్గాల వైపు‌ దృష్టి మరల కుండా చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ఉద్యోగాలు సంపాదించి,తమ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని, గ్రామానికి,జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఎస్ ఐ కే,శ్వేత సూచించారు. గ్రామంలో ఒక్కరికి ఉద్యోగం వస్తే గ్రామంలో పది మంది తన వెంట వస్తారని అన్నారు.అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని సంఘవిద్రోహ శక్తులు వీరిని ప్రలోభాలకు గురిచేసి వీరిని చెడు మార్గం వైపు నడిచేలా ప్రోత్సహిస్తారు. ప్రలోభాలకు లొంగకుండా మంచిని ఎంచుకుని సమాజ శ్రేయస్సుకు విద్యార్థులు పాటు పడాలని ఎస్ ఐ కే,శ్వేత అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు