

జనం న్యూస్- జూన్ 21- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ హిల్ కాలనీ గ్రంథాలయంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, ఈ సందర్భంగా కౌన్సిలర్ రమేష్ జి మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ కోసం చేసిన త్యాగం తెలంగాణ ప్రజల కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని,ఆయన కేవలం ఒక విద్యావేత్త మాత్రమే కాదు తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శకుడు కూడా అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించాలనే దృఢ సంకల్పంతో ఎన్నో సంవత్సరాలు ఆయన కృషి చేశారని తెలంగాణ ప్రజలందరిలో చైతన్యం నింపి ఉద్యమాన్ని ముందుకు నడిపించారని ఆయన జీవితం మనందరికీ ఒక స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ హిరేకర్ రమేష్ జి, భూష రాజుల కృష్ణ, చంద్రమౌళి నాయక్, వీరయ్య, లక్ష్మణ్ నాయక్, ఎస్సీ నాయకులు ఆదాసు విక్రం, పి సత్యనారాయణ, గాజుల రాము, గోవింద్, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.