

జనం న్యూస్- జూన్ 21- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ హిల్ కాలనీ లో గత 45 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కెనరా బ్యాంక్ నాగార్జునసాగర్ శాఖ ను హాలియా కు తరలిస్తున్నారని గత కొంతకాలంగా వస్తున్న వార్తలను నిరసిస్తూ ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో హిల్ కాలనీలోని కెనరా బ్యాంకు వద్ద ధర్నా నిర్వహించారు, అనంతరం కెనరా బ్యాంక్ మేనేజర్ కు బ్యాంకును వేరే ప్రాంతానికి తరలించ వద్దంటూ వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ గడిచిన 45 సంవత్సరాలుగా కెనరా బ్యాంక్ నాగార్జునసాగర్ లో శాఖను నిర్వహిస్తుందని ఈ శాఖలో ఎంతోమంది రైతులు ,ఉద్యోగులు, పెన్షన్ దారులు , వ్యాపారస్తుల ఖాతాలు ఉన్నాయని ఎంతోమంది ఖాతాదారులు గోల్డ్ లోన్లు, లాకర్ లు, ఫిక్స్డ్ డిపాజిట్లు కలిగి ఉన్నారని ఇంత వ్యాపారం సాగిస్తున్న ఈ కెనరా బ్యాంకు బ్రాంచ్ ని వేరే ప్రాంతానికి తరలించడం సబబు కాదని, ఇక్కడి ఈ కెనరా బ్యాంక్ శాఖను ఇలానే ఉంచి హాలియాలో కొత్త శాఖను ప్రారంభించుకోవాలి కానీ ఇక్కడి శాఖను తరలించవద్దని, వృద్ధులను, పెన్షన్ దారులను, ఖాతాదారులను ఇబ్బందులకు గురి చేయవద్దని అఖిలపక్షం నాయకులు కోరారు. ఇట్టి విషయమై వరంగల్ లోని కెనరా బ్యాంక్ రీజినల్ ఆఫీస్ లో కూడా వినతిపత్రం అందజేస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రమేష్ జి, ఎస్ సి నాయకులు ఆదాసు విక్రం, బీసీ నాయకులు భూష రాజుల కృష్ణయ్య, లక్ష్మణ్ నాయక్, చంద్రమౌళి నాయక్ ,వీరయ్య, గాజుల రాము, పి సత్యనారాయణ, బ్యాంకు ఖాతాదారులు అచ్చు నాయక్ ,రవి నాయక్ ,సభావత్ లక్ష్మి, సభావత్ పార్వతి , నాగరాజు తదితరులు పాల్గొన్నారు.