

బిచ్కుంద జూన్ 21 జనంన్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో బిచ్కుంద కోర్టులో న్యాయమూర్తి శ్రీ జే వినీల్ కుమార్ ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాటు చేశారు. మొట్ట మొదలు జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది.ఈ సందర్భంగా కోర్టు న్యాయమూర్తి శ్రీ జె వినీల్ కుమార్ గారు మాట్లాడుతూ మన జీవితంలో ఒక భాగంగా యోగా ఉండాలని ఆయన సూచించారు శారీరిక మానసిక ఆధ్యాత్మిక సమతుల్యతకు దోహదపడుతూ ప్రజల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడుతుంది అన్నారు. యోగా అనేది శరీర దృఢత్వానికి మనసు ప్రశాంతతకు చాలా ఉపయోగకరమైన దాని సూచించారు. యూవత డ్రగ్స్ వాడకం తగ్గించాలని తెలియజేశారు.అనంతరం వివిధ రకాల యోగ ఆసనాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల్ లోక అదాలత్ మెంబర్స్ ఏ ప్రకాష్ పటేల్ ఈ శివాజీ ,ఎం లక్ష్మణరావు, జి మల్లేష్, టి విట్టల్, ఏ విట్టల్ రావు, రాజేష్ దేశ్ముఖ్ శంకర్ పటేల్ మహమ్మద్ మనోజ్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

