

జనం న్యూస్ జూన్ 21 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 14వ వర్ధంతి సందర్భంగా మూసాపేట్ అంజయ్య నగర్ చౌరస్తా లో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర బీసీ వికాస్ సమితి అధ్యక్షులు బాశెట్టి నర్సింగ్ రావు, గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు చిలక ప్రకాష్ ముదిరాజ్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి వారి ఆహ్వాన మేరకు తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ హాజరై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా స్వరాష్ట్ర సాధన కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన గొప్ప మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ గారిని వారు తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటారని కొని ఆడారు, ఈ కార్యక్రమంలో తోట సత్యనారాయణ, డోలక్ నర్సింగ్ రావు, అశోక్ చారి, పండిత్ రావు, దేవేందర్, స్వరూప మరియు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.