Listen to this article

నిత్య జీవితంలో ప్రతి ఒక్క పోలీస్ అధికారి సిబ్బంది యోగ వ్యాయామం అలవర్చుకోవాలి

జనం న్యూస్ జూన్ 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఏఆర్ పోలీస్ హెడ్ కోటర్స్ నందు ఈరోజు ప్రపంచ యోగ దినోత్సవం ను జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొని, యోగాసనాలు వేశారు.జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ….ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బంది కి యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.యోగా ప్రకృతి సిద్ధమైన శక్తిని అందిస్తుoదని, ప్రపంచ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా అనేది, మన నడక దినచర్యలో భాగం కావాలని, మన పోలీసుల ఆరోగ్యానికి యోగా ఎంతో ఉపయోగ పడుతుందని అన్నారు. 2015వ సంవత్సరం జూన్21వ తేదీన మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా యోగాడేగా జరుపుకున్నాము. భారతీయ సంస్కృతిలో యోగా చాలా ప్రత్యేకమైనది. దీనిని పతంజలి చక్కగా వివరించారు. ఆచారంలో మనిషి విశిష్టమైన సాధన చేయడానికి యోగా ప్రాముఖ్యత చాలా ఉంటుంది. చక్కటి యోగా సాధన ఉంటే, మనిషి తన ఆరోగ్యాన్ని కాపాడుకోగలము. ఇంకా మనో నియంత్రణకు మూలమైన ప్రాణాయమం యోగాలో తెలిపింది…మన పోలీస్ డ్యూటీస్ లో ఒత్తిడిని తగ్గించటానికి యోగ చాలా ఉపయోగపడుతుందని అన్నారు.
రోజు వారిగా వ్యాయామం, యోగ చేయడం తో ఒత్తిడిని తగ్గిస్తుంది.ధ్యానం, శ్వాస సాధనాల వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.ఆత్మవిశ్వాసం మరియు దృఢ నిశ్చయం పెరుగుతాయి. యోగా వల్ల మనపై మనకు విశ్వాసం కలుగజేస్తుంది. యోగా చేయడం వల్ల దేహానికే కాకుండా మనసును కూడా శుద్ధి చేస్తుంది. శారీరక మానసిక ఆరోగ్యానికి యోగ ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం కావున పోలీస్ అధికారులు సిబ్బంది వ్యాయామం యోగ లాంటిది నిత్యజీవితంలో అలవాటుగా మార్చుకోవాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్నగర్ డిఎస్పి రామానుజం, డి.సి.ఆర్బి డి.ఎస్.పి విష్ణుమూర్తి, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.