

జనంన్యూస్. 23.నిజామాబాదు.
(అట్రాసిటీ బాధితుల పరిహారం) మహిళలు మరియు బాలికలపై జరిగిన దారుణాలకు గురైన బాధితులకు పరిహారం చెల్లింపును ఖరారు చేయడానికి జిల్లా స్థాయి కమిటీ సమావేశం తేదీ:23-06-2025 నాడు శ్రీ టి. వినయ్ కృష్ణ రెడ్డి, జిల్లా కలెక్టర్, నిజామాబాద్ అధ్యక్షతన సంబందిత కార్యాలయ అధికారులతో సమన్వయ సమావేశామును నిర్వహించడమైనది.ఇట్టి సమావేశములో జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు దివ్యాంగుల మరియు వయో వృద్దుల సంక్షేమ శాఖ గారు జి.ఓ.యామ్.యస్.నో.28, తేదీ:13.06.2011 ప్రకారం జిల్లాలో పోక్సో చట్టం 2015 Cr.P.C(అట్రాసిటీ బాధితుల పరిహారం) క్రింద నమోదు అయినటువంటి అర్హత కలిగిన మొత్తము 86 కేసెస్ (పోక్సో చట్టం 2015 క్రింద 57, మహిళా రేప్ కేసెస్ 12, వరకట్న మరణాలు 4, కిడ్నాప్ కేసులు 13) బాధితులకు పరిహారం చెల్లింపును యొక్క వివరాలను జిల్లా స్థాయి కమిటీకి తెలియజేసినారు.
తదుపరి జిల్లా కలెక్టర్, నిజామాబాద్ గారు అర్హత కలిగిన మొత్తము 86 కేసెస్ వివరాలను తెలుసుకోవడం జరిగినది మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆద్వర్యంలో బాధితులకు అందించే సేవల గురించి చర్చించడం జరిగినది. బాధితులకు పరిహారం చెల్లింపును త్వరతగతిగా అందించాలని జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు దివ్యాంగుల మరియు వయో వృద్దుల సంక్షేమ శాఖ, నిజామాబాద్ గారికి ఆదేశాలు జారీచేసియునారు. అర్హత కలిగిన మొత్తము 86 కేసులను జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమోదించడం జరిగినది. ఇట్టి కార్యక్రమములో జిల్లా కలెక్టర్, నిజామాబాద్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీసు, పి.సాయి చైతన్య, ఐ.పి.యస్. గారు, ప్రాజెక్టు డైరెక్టర్, డి.ఆర్.డి.ఓ. డి.సాయ గౌడ్ గారు, డా. రాజశ్రీ, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి గారు, జిల్లా విధ్య అదికారి శ్రీ అశోక్ గారు, జిలా సంక్షేమ అధికారిణి శ్రీమతి ఎస్.కే. రసూల్ బీ గారు, ఎన్జిఓ స్నేహ సొసైటి కార్యదర్శి శ్రీ.యస్. సిద్దైయ్య గారు, పాల్గొన్నారు.