

జనం న్యూస్ 24 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
నేడు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు అమెరికా యుద్ధ సామగ్రి అమ్మకాలు చేసి లాభాలు కోసం,స్వలాభం కోసం మరొకటి కాదని,అమెరికా దూరంకారానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయాలని ఉత్తరాంధ్ర అభివృద్ది వేదిక కన్వీనర్ ఏ.అజ శర్మ పిలుపునిచ్చారు. సోమవారం ఎస్ ఎఫ్ ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్ ఎఫ్ ఐ అఖిల భారత మహాసభలు సందర్భంగా స్తానిక జెడ్పీ సమావేశ మందిరంలో ప్రపంచ యుద్దాలు పర్యవసానాలు పాలస్తీనాకు సంగీభావం అనే అంశంపై సదస్సు జరిగింది. ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు డి.రాము అధ్యక్షతన జరిగిన సదస్సులో ముందుగా యుద్ధాల్లో మరణించిన వారికి సదస్సు నివాళులు అర్పించింది. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన ఉత్తరాంధ్ర అభివృద్ది వేదిక కన్వీనర్ ఏ. అజశర్మ మాట్లాడుతూ నేడు ప్రపంచ దేశాల్లో జరుగుతున్న యుద్ధాలు అన్ని అమెరికా ప్రోత్సాహంతో జరుగుతున్నావేనని అన్నారు. ప్రపంచ దేశాల్లో ఇజ్రాయెల్, ఇరాన్, దేశాలు మధ్య యుద్ధం జరుతుంది.అదే విధంగా దేశంలో మణిపూర్ లో కూడా రెండు తేగలు మధ్య జరుగుతున్నాయన్నారు. శ్రీ శ్రీ చెప్పినట్లుగా ఏ దేశ చరిత్ర చూసిన ఏమున్నది గర్వ కారణం అని చెప్పిన విధంగా ఉందన్నారు. యుద్ధాల్లో గర్వించడానికి ఏమున్నది మనుషులను మనుషులను చంపుకోవడం తప్ప అన్నారు. ఈ యుద్దాలు అనేవి ఎందుకు జరుగుతున్నాయి అనేది పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.20 శతాబ్దంలో మూడు వందలు పైగా యుద్ధాలు జరిగాయి. వాటిని ద్వారా గుణపాఠాలు నేర్చుకోవడం జరుగుతుందన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం,రెండో ప్రపంచ యుద్దాలు జరిగాయన్నారు. దీర్ఘ కాలం అమెరికాకు వియత్నాం కు మధ్య జరిగిన యుద్ధం, కొరియా యుద్ధం, ప్రస్తుతం రష్యా ,ఉక్రెయిన యుద్ధం మూడేళ్ల పాటు జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఇజ్రాయిల్,ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయిల్ కి మద్దతుగా ఇరాన్ మీద అమెరికా బాంబులు వేయడం జరిగిందన్నారు. ప్రపంచ యుద్ధంలో అమెరికా అణుబాంబు జపాన్ పై వేసి ప్రపంచాన్ని బయటపెట్టే ప్రయత్నం చేయడం జరిగిందన్నారు. దీంతో చాలా దేశాలు అణుబాంబు లు తయారు చేయడం జరిగిందన్నారు. జపాన్ లో అణు బాంబు పరిణామాలు నేటికి కనబడుతున్నాయన్నారు. అత్యధికంగా 4309 అణుబాంబులు రష్యా దేశంలో ఉన్నాయన్నారు. ప్రత్యర్ధులను బెదిరించడానికి ఈ బాంబులు ఉంచుకోవడం జరుగుతున్నాయన్నారు. ఇలా చాలా దేశాల్లో అణు బాంబులు ఉంచుకోవడం జరిగింది. ఇరాన్ దేశం అణు బాంబులు తయారు చేస్తున్నడని చెప్పి నేడు ఇజ్రాయిల్ యుద్ధం చేస్తుందన్నారు. అణు బాంబులు అనేది ప్రపంచానికి మంచిది కాదన్నారు. కానీ ఆ పేరుతో ఇరాన్ పై దాడి అన్యాయమన్నారు.ప్రపంచంలో మత ,ఆర్థిక, రాజకీయ పరమైన యుద్దాలు జరిగాయన్నారు.ఆదిపత్యం కోసం జరిగినవే యుద్దాలు అన్నారు. మనిషి ప్రాణం తీయడం అనేది నేరమన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఏడు కోట్ల మంది మరణించడం జరిగిందన్నారు. శత వర్ష యుద్ధం 116 ఏళ్లపాటు ఇంగ్లండ్ కి,ప్రాన్స్ కి మధ్య జరిగింది. వియత్నాం యుద్ధం ప్రెంచ్ దేశం నుంచి స్వాతంత్ర్యం కోసం యుద్ధం చేయడం జరిగిందన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధం జరిగినా అమెరికా పాత్ర ఉంటుందన్నారు. పాక్ ఇండియా మధ్య జరిగిన యుద్ధం ఆగిపోవడానికి అమెరికా అణ్వాయుధాలు పాకిస్తాన్లో ఉండటం వలన యుద్ధం ఆగిందన్నారు. గాజా మీద దాడి చేసి పసిపిల్లలను చంపేస్తున్న ఇజ్రాయిల్ కి అమెరికా మద్దతు ఇస్తుందన్నారు. ఇది అన్యాయమని అడగాల్సిన మన దేశం న్యాయం వైపు కాకుండా, మన దేశ విదేశాంగ విధానంలో మార్పు చేసి ఇజ్రాయిల్ కి మద్దతుగా అన్యాయమవైపు నిలబడిందన్నారు. ఆఫ్ఘన్స్టాని లో పదేళ్ల బాటు యుద్ధం చేసి తాలిబన్లు పెంచి పోషించిన దేశం అమెరికా అన్నారు. అమెరికా అన్ని ఖండాల్లో జరుగుతున్న యుద్ధాల్లో పాల్గొంటుందన్నారన్నారు. యుద్దాలు వలన అమెరికా ప్రయోజనం ఏమిటి అన్నది ముఖ్యమన్నారు.అమెరికాలో ఆయుధ కర్మాగారాలు ఎక్కువగాఉన్నాయన్నారు.మొత్తం ప్రపంచంలో యుద్ద సామగ్రి తయారీలో 40 శాతం అమెరికాలో తయారు అవుతున్నాయన్నారు. ఆయుధాలు అమ్ముడు పోవడం కోసం యుద్ధాలను అమెరికా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. యుద్ద సామగ్రి వ్యాపారం కోసం యుద్ధాలను ప్రోత్సహిస్తూ వస్తుందన్నారు. యుద్ద సామగ్రి అమ్ముకోవడం కోసమే యుద్ధాలకు కారణమన్నారు. అమెరికా ఐదు దేశాలకు ఎక్కువగా సరఫరా చేస్తుందన్నారు. అందులో ఇండియా,పాకిస్తాన్ ఉందన్నారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థ బలం యుద్ద సామగ్రి మీద ఆధారపడి ఉందన్నారు. ఏ యుద్ధంలోనైనా లాభ పడేది పెట్టుబడిదారులు, నష్ట పోయేది సామాన్యులే అన్నది లెనిన్ చెప్పడంజరిగిందన్నారు.యుద్ధాలనుదోపిడికి వ్యతిరేకంగా ,కార్మిక,ప్రజా అనుకూల విధానాలు కోసం అంతర్యుద్ధం చేయమని చెప్పడం జరిగిందన్నారు. నేడు మన దేశంలో జలు,కార్మికులు,నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా అంతర్యుద్ధం చేయాల్సిన అవసరం మనపై ఉందన్నారు. ప్రపంచంలో పెట్టుబడి ధారీ విధానం నాశనం అయితే తప్ప యుద్దాలు నియంత్రణ జరగదన్నారు. యుద్దాలు జరగకుండా ఉండాలంటే ఆధిపత్య ధోరణి పోవాలన్నారు. పాలస్తీనా దేశస్తులు మాతృ భూమి కోసం వారు పోరాటం చేస్తున్నారన్నారు వారికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.
యుద్ధం అనేది ఒక వ్యాపారం గా మారిందన్నారు. లాభాలు కోసం ప్రాణాలను,దేశాలను నాశనం చేస్తున్నవి ఈ యుద్దాలు అనేది తెలుసుకోవాలన్నారు.అనంతరం ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్ మాట్లాడుతూ ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు తెలుసుకోవడం ద్వారా మనం ఎక్కడ ఉన్నామో తెలుస్తుందన్నారు. అమెరికా భారతీయులను సంకెళ్లు వేసి పంపిస్తున్న విషయం గమనించాలన్నారు. అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగులను తొలగించేస్తున్నారన్నారు. .బట్టలు లేని స్తితి నుంచి బట్టలు వేసుకునే స్తాయికి, ఆదిమ సమాజం నుంచి నేటికి మానవుడు మార్పులు చేసుకుంటూ సుఖ జీవితం కోసం అనేక మార్పులు చేసుకుంటూ రావడం జరిగిందన్నారు. నేడు జరుగుతున్న ఇరాన్,ఇజ్రాయిల్ యుద్ధం వలన కూడాయిల ధరలు పెరిగి మన ప్రజలపై భారాలు పడనున్నాయన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పది లక్షలు ఉద్యోగాలు అన్నారు దాని గురించి మనం ఆలోచించడం లేదన్నారు. మన భవిష్యత్ కోసం ఆలోచించుకోవాల్సిన అవసరముందన్నారు. వారం రోజుల క్రిందట మేఘా అనే అమ్మాయి అమెరికాలో డిగ్రీ పట్టా తీసుకునే సమయంలో నేను డిగ్రీ పట్టా తీసుకుంటున్నాను పాలస్తీనలో విద్యార్దులు తిండి లేక అగమ్యగోచరంగా ఉన్నారు నాకు డిగ్రీ కంటే వారికి తిండి పెట్టడం ముఖ్యమని ప్రసంగించడం జరిగిందన్నారు. పాలస్తీనా దేశం వాళ్ళ దేశం కోసం పోరాటం చేస్తున్నారన్నారు. ఆయిల్ రవాణాను అనుకూలమైన ప్రాంతం పాలస్తీనా ఉందన్నారు. దానిని ఎలాగైనా ఆక్రమించుకోవాలనే దురుద్దేశ్యంతో అమెరికా, ఇజ్రాయిల్ దాడులు చేస్తుందన్నారు. ఈ పరిస్థితిలో పాలస్తీనా కు మద్దతుగా ఉండాల్సింది పోయి మనం దోపిడీదార్లుకు అండగా నేడు మోడీ ప్రభుత్వం ఉందన్నారు. ఇంతటి మారణకాండ జరుగుతుంది దీనికి వ్యతిరేకంగా విద్యార్దులు,యువత పాలస్తీనాకు సంగీభావం గా నిలబడాలని పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి కోసం మనం గొంతులు కలపాలన్నారు. సదస్సులో ఎస్ ఎఫ్ ఐ కేంద్ర కమిటీ సభ్యులు పావని, జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేష్,ఉత్తరాంధ్ర అభివృద్ది వేదిక ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం శ్రీనివాస, గర్ల్స్ కో కన్వీనర్ శిరీష నాయకులు,అధిక సంఖ్యలో విద్యార్దులు పాల్గొన్నారు.ఎస్ ఎఫ్ ఐ కేంద్ర కమిటీ సభ్యులు పావని, జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేష్,ఉత్తరాంధ్ర అభివృద్ది వేదిక ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం శ్రీనివాస, గర్ల్స్ కో కన్వీనర్ శిరీష నాయకులు,అధిక సంఖ్యలో విద్యార్దులు పాల్గొన్నారు.