

(జనం న్యూస్ జూన్ 24 భీమారం మండలం ప్రతినిధి కాసిపేట రవి)
రోజులు మారుతున్నాయి. కాలానుగుణంగా మన జీవన శైలిలో అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా వ్యవసాయం లో ఊహించని మార్పులు ఊహకందని మార్పులు వచ్చాయి. గత 60 ఏళ్లుగా చేస్తున్న రసాయన వ్యవసాయంతో నేలసారం పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో భవిష్యత్ సాగు మరో పదేళ్లు పోతే ప్రశ్నర్థకమే…..ఈ రసాయన వ్యవసాయం తో మనం పండించే పంటను విషం ఆహారంగా తీసుకుంటున్నాము. కాదు కాదు మనం తినేది రోజూ విషమే.కాబట్టి ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుండి మీ కుటుంబ ఆరోగ్య అవసరాల కోసం ఎలాంటి రసాయన మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేపట్టెందుకు నిర్ణయం తీసుకోండి. దయచేసి మీరు మీ గ్రామాలలో తోటి రైతులతో ఉన్నప్పుడు, సెంటర్లలో, రచ్చ బండల వద్ద, గ్రామాల లోని చెట్ల క్రింద కూర్చున్నపుడు ప్రకృతి వ్యవసాయం గురించి ఎక్కువగా చర్చించండి. పాతకాలం వారితో మాట్లాడండి… పూర్వపు రోజుల వ్యవసాయం కోసం ఈరోజే నిర్ణయం తీసుకోండి. మనతో పాటు మన భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం మార్గం. సనేడ్జి ప్రోడక్ట్ తో సాధ్యం సదా మీ సేవలో
కాసిపేట రవి 9866589601