

జనం న్యూస్ జూన్ 24 అమలాపురం
భారతీయ జనతా పార్టీ అమలాపురం రూరల్ మండలం లో ఏ. వేమవరం గ్రామంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల సుపరిపాలన, పేదల సంక్షేమం గూర్చి వికసిత భారతదేశపు అమృతకాలం వీధి సమావేశం అమలాపురం రూరల్ మండలం భాజపా అధ్యక్షుడు బొంతు శివాజీ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమానికి భాజపా జిల్లా కన్వీనర్ ఇళ్ల సత్యనారాయణ ముఖ్య అతిధిగా మరియు ముఖ్య వక్తగా విచ్చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల సుపరిపాలన, పేదల సంక్షేమం, అంత్యోదయ సిద్ధాంతంతో చిట్ట చివరి వ్యక్తికి కూడా సంక్షేమ పథకం అందాలన్న దిశతో వికసించిన భారతం కోసం ముందుకు అడుగులు వేస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి గారు అని కొనియాడారు, మహాత్మా గాంధీ జాతి ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి 100 రోజుల పని దినాలు కల్పించి వారికి గౌరవ వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో వేయడం జరుగుతుంది, అలాగే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కిందనే ప్రాథమిక పాఠశాలలకు పాఠశాల చుట్టూ ఉన్న గోడను నిర్మించడం కానీ, సచివాలయాలు నిర్మించుకోవడంలో కానీ ఇంకా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు మీ పంచాయితీలలో, మీ ద్వారా జరుగుతుందన్న అభివృద్ధిని వారందరికీ తెలియజేయడం జరిగింది..
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు వికసిత భారత జిల్లా కన్వీనర్ గనిశెట్టి వెంకటేశ్వరరావు (బాబీ మాస్టారు), అమలాపురం పట్టణ ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకట సుబ్బరాజు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు..
