

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జూన్ 25
ప్రకాశం జిల్లా ఒంగోలులో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్. షర్మిల విస్తృతస్థాయి సమావేశమునకు వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్.సైదా ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్. మహబూబ్ వలి మరియు మండల పార్టీ అధ్యక్షులు షేక్. హుస్సేన్ ఆధ్వర్యంలో తర్లుపాడు మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు. కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్.మహబూబ్ వలి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం శక్తివంశం లేకుండా పనిచేస్తామని, ముస్లిం మైనార్టీల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ఆరోగ్యశ్రీ, ప్రాజెక్టుల నిర్మాణం, రుణమాఫీ, వంటి వాటిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ప్రవేశపెట్టిందని కాబట్టి మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.