


▪ టిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్..
జనం న్యూస్ //24//జనవరి //జమ్మికుంట //కుమార్ యాదవ్.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ బిఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు…మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి విద్యా శాఖను తన వద్దనే ఉంచుకున్నారన్నారు.
వీసీల,నియామకాలపై కేంద్రం పెత్తనాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించడలేదు అని అన్నారు.కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా రేవంత్ రెడ్డి సమర్థిస్తున్నారు అని తెలిపారు. యూనివర్సిటీలపై గవర్నర్,కేంద్రం పెత్తనం ఏంటి అని ప్రశ్నించారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనంపై కేసీఆర్ సిఎంగా ఉండి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారఅన్నారు. యూనివర్సిటీలపై కేంద్రం పెత్తనంపై కోదండరాం,హరగోపాల్, ఆకునూరి మురళీ ఎందుకు మాట్లాడటం లేదు అని పేర్కొన్నారు.యూజీసీపై కేంద్రం నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలన్నారు. అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం పని చేసిన మేధావులు నోరు విప్పాలి, యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లను నియమించే,అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలని మాట్లాడారు.యూనివర్సిటీలపై కేంద్రం పెత్తనంపై రాష్ట్రంలో అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకుని పోరాటం చేస్తాం అని మండిపడ్డారు.