

జనం న్యూస్, జూన్ 25, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి :
పట్టణం లో టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.
మెట్ పల్లి పట్టణం లో టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 28,60000. లక్షల రూపాయల విలువ గల కోరుట్ల నియోజకవర్గ గ్రామ పట్టణ లకు చెందిన 52 లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. అనంతరం టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు మాట్లాడుతూ సి ఎం సహాయ నిధి నిరుపేదలకు వరం అని పేదవారు అత్యవసర చికిత్స పొంది నా వారికి ఎంతో లబ్ధి చేకూరుస్తుందని ఇది నిరుపేద కుటుంబాలు అప్పుల బారిన పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇటువంటి కార్యక్రమంలో ఎక్కువ నిధులు కేటాయించిందని దీనిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేదలు రైతులు ఆనందంగా ఉన్నారని సీఎం మహిళలకు ఉచిత ప్రయాణం నూతనంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం రైతు భరోసా భూ భారతి ద్వారా రైతుల సమస్యలు పరిష్కారంఎన్నో పథకాల ద్వారా ప్రజలు లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఈకార్యక్రమంలొ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ సేల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి,మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్భుదిన్ పాషా,టీపీసీసీ ఫిషర్మెన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి,జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు దామెర రాజశేఖర్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ నల్లూరి సాగర్, మాజీ ఎంపిటిసి,కోరుట్ల మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కుంటాల వికాస్,మాజీ సర్పంచ్ బుడత సుదర్శన్,మాజీ ఎంపిటిసి సింగరపు అశోక్,కాంగ్రెస్ నాయకులు కల్లెడ గంగాధర్,యండి జాఫర్,మామిడి రాజశేఖర్ రెడ్డి,ఇప్పపెల్లి గణేష్ మొగలి రాజేందర్,తోగిటి నాగరాజు,ఎట్టెం మల్లేశ్,పిట్టల వెంకటేష్,శ్రీనివాస్,రెండ్ల వెంకటేష్,కనుక దినేశ్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.