Listen to this article

జనం న్యూస్ 24.జనవరి. కొమురంభీమ్ (ఆసిఫాబాద్) జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్:- జైనూర్ :యువతి అదృశ్యమైన సంఘటన జైనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శుక్రవారం జైనూర్ ఎస్సై సాగర్ తెలిపిన వివరాల ప్రకారం…జైనూర్ మండలం శివనూర్ గ్రామానికి చెందిన యువతి శిల్పా (20) భద్రాచలంలోని పాల్వంచ ప్రవేట్ కళాశాలలో బిటెక్ 2nd year చదువుతోంది. సంక్రాంతి పండుగ సెలవలు కావడంతో శివనూరు గ్రామంలోని తన ఇంటికి వచ్చింది. ఈ నెల 20వ తేదీ ఉదయం 9:30 గంటల సమయంలో పాల్వంచ కళాశాలకు వెళ్తానని ఇంటి నుండి అటో లో జైనూర్ కు వెళ్లిపోయింది. ఉదయం 11:30గంటలకు యువతి తండ్రి పవార్ సుభాష్ తన కూతురు శిల్పా కు పోన్ చేయగా నేను బస్సులో ఉన్నాను నాన్న బస్సులో జనాలు ఎక్కువగా ఉన్నారు.నేను తర్వాత పోన్ చేస్తా అని చెప్పి స్విచ్ అప్ చేసుకుంది. మళ్లీ మధ్యాహ్నం యువతీ తండ్రి పోన్ చేసే సరికి స్విచ్ వచ్చింది. దీంతో అతని మేనల్లుడు జాదవ్ ప్రదీప్ కు పోన్ చేస్తే అతని పోన్ కూడ స్విచ్ ఆఫ్ వచ్చింది. మేనల్లుడు ప్రదీప్ కూడా ఇంటి నుండి నగదు తీసుకొని వెళ్ళినాడు. కుటుంబీకులు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. బంధువులను ఆరా తీసినా ఆమె జాడ కనిపించలేదు. దీంతో శుక్రవారం యువతి తండ్రి పవార్ సుభాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాగర్ తెలిపారు.