


జనం న్యూస్ జనవరి 24 కాట్రేనికోన:- కాట్రేనుకున మండల, సత్తమ్మచెట్టు గ్రామము నందు ఉచిత పశు వైద్య శిభిరం ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమాన్ని గ్రామ ఎక్స ఛైర్మెన్ శ్రీ నాగిడి నాగేశ్వరా రావు గారు టీడీపీ నాయుకులు, మరియు వైస్ ఎంపీపీ శ్రీ సానబోయిన నాగేశ్వర రావు గారు, సర్పంచ్ శ్రీ గంటి వెంకట సుదాకర్ గారు ప్రారంభోత్సవం చేసినారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి కె.వెంకట్ రావు గారు, అసిస్టెంట్ డైరెక్టర్ బి.నాగేశ్వర రావు గారు,మండల పశువైద్యాధికారి డాక్టర్ టి. ఎం. యామిని గారు మరియు సచివాలయం సిబంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క పాడి పశువులకు గర్భకోశ వ్యాధులకు పరీక్షలు చేయించు కుని వైద్యం చేయించుకున్నారు. లేగ దూడలకు ఏలిక పాములు నివారణ మందులు మరియు మేకలకు నట్టల నివారణ మందులు వేయించుకోవడం జరిగినది.