Listen to this article

జనం న్యూస్ – జూన్,25:- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ –

అంతర్జాతీయ పర్యాటకేంద్రం నాగార్జునసాగర్ ను బుధవారం పలువురు ప్రముఖులు సందర్శించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి (సంఘటన మంత్రి) చంద్రశేఖర్ తివారి, బి జె పి నల్గొండ అధ్యక్షులు వర్షిత్ రెడ్డి తో కలసి బుడ్డవనం ను సందర్శించారు. ఈ సందర్బంగా బుద్ద పాదాలవద్ద వందనం సమర్పించిన అనంతరం బుద్ధచరిత వనం, మహాస్తూపం సందర్శించారు. మహాస్తూపం లోపల ధ్యాన మందిరంలో ధ్యానం చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుద్ధవనం ప్రశాంత వాతావరణంలో నిర్మించడం తనను ఎంతగానో ఆకట్టుకుంది అన్నారు.సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి కుటుంబ సభ్యులతో బుద్ధవనం, నాగార్జునకొండ, నాగార్జునసాగర్ డ్యామ్ ను సందర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీకి హిస్టరీ విభాగానికి చెందిన విద్యార్థులు ప్రొఫెసర్ లావణ్య ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ లోని నాగార్జునకొండ, బుద్ధవనాని సందర్శించారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ నాగార్జునసాగర్, నాగార్జునకొండ,బుద్ధవనం చారిత్రక విశేషాలను వివరించారు.