Listen to this article

తక్షణమే విచారణ జరపాలి.

సీపీఐ జిల్లా కార్య వర్గ సభ్యులు చండ్ర డిమాండ్.

జనం న్యూస్,జూన్25,జూలూరుపాడు:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు మంజూరులో భాగంగా జులూరుపాడు మండలంలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల జాబితా లో అవకతవకలపై తక్షణమే విచారణ జరిపి నిరుపేదలకు న్యాయం చేయాలని కోరుతూ సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో జూలూరుపాడు తాసిల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు అనంతరం సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో మితిమీరన రాజకీయ జోక్యం వలన అర్హులైన నిరుపేదలకు పథకాన్ని దూరం చేసి అన్హర్హులకు పెద్దపీట వేసి వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయటం మంచిది కాదని, అనేక గ్రామాల్లో ఇల్లు ఉన్నవారికి మరల ఇల్లు మంజూరు చేశారని , ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అధికారులు కూడా అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ నిజమైన నిరుపేదలకు అన్యాయం జరిగిందని విమర్శించారు. ప్రజా పాలనలో నూతన రేషన్ కార్డులు మంజూరు చేసి నేటికీ రేషన్ కార్డులు ఇవ్వలేదని , ప్రజలు కార్యాలయం చుట్టూ తిరుగుతూ సకాలంలో రాక తీవ్రస్థాయిలో నష్టపోతున్నారని ప్రభుత్వం వెంటనే రేషన్ కార్డులను పంపిణీ చేయాలని కోరారు, మండలంలో దాదాపు 5 సంవత్సరాల నుంచి దరఖాస్తు చేసుకొని వృద్ధాప్య వితంతు, వికలాంగుల పెన్షన్లు , రాక ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని తక్షణమేమంజూరు చేయాలని కోరారు, అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక తాసిల్దార్ కు అందజేశారు , ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి ఎస్కే నాగుల్ మీరా, సీపీఐ నాయకులు, గుండె పిన్ని మధుసూదన్ రావు యాస రోశయ్య, ఎస్ కె.చాంద్ పాష గుడిమెట్ల సీతయ్య ,చెరుకుమల రామకృష్ణ, రాజేశ్వరరావు, కంచర్ల రాఘవేంద్రరావు, కల్తీ కృష్ణయ్య, అనుమల అశోక్, కొండ వీరయ్య, కొమ్ము రాంబాబు, ఎస్ కె బుడేను, గార్లపాటి శివకృష్ణ,బరగడ రమేష్ పసుపులేటి పవన్, కిరణ్,సాయి,బబ్లు,సందీప్ పద్మాకర్, తదితరులు పాల్గొన్నారు