Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 24 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- దావోస్ సదస్సు సాక్షిగా పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల, దేశాల ప్రతినిధులతో ఏపీ సీఎం అండ్ కో జరిపిన చర్చలు సఫలం. బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేయడంలో విజయవంతమైన చంద్రబాబు, మంత్రులు. 4 రోజుల దావోస్ పర్యటన.. విజన్ 2047 సాకారానికి కీలక ఘట్టం కానుంది. దావోస్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, టీ.జీ.భరత్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో కూడిన రాష్ట్ర అధికారుల బృందం వేసిన ప్రతి అడుగు రాష్ట్ర ప్రగతికి బాటలు వేసిందనడం అతిశయోక్తి కాదు. ఏపీ బ్రాండ్ ను ప్రమోట్ చేసేందుకు అందివచ్చిన సువర్ణావకాశాలను అందిపుచ్చుకోవడం, అవకాశాలుగా మలచడంలో సీఎం జట్టు విజయవంతమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. జ్యురిచ్ విమానాశ్రయంలో అడుగిడింది మొదలు ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఆలోచనలను, రాష్ట్రంలోని వనరులు, అవకాశాలకు ముడిపెట్టి ఇచ్చిన వివరణ, సదస్సులో పాల్గొన్న ప్రతి కంపెనీ, ప్రతి సీ.ఈ.వో ఏపీ గురించి ఆలోచించేలా చేసిందనే చెప్పాలి. ఒకవైపు వివిధ వర్గాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి సన్ రైజ్ స్టేట్ బ్రాండ్ ను ప్రపంచస్థాయిలో ప్రమోట్ చేయడంలో బాబు, లోకేష్ లు సక్సెస్ అయ్యారు. 15 ప్రపంచ స్థాయి వాణిజ్య సంస్థల అధిపతులతో సమావేశం. పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే ధ్యేయంగా ముఖ్యమంత్రి, ఆయన బృందం దాదాపు 15 ప్రపంచస్థాయి అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో సమావేశమైంది. రాష్ట్రంలోని ప్రకృతి, మానవ వనరులు, అవకాశాలను, ప్రభుత్వం అందించే సహాయ సహకారాలను వారికి తెలియచేయడంలో సఫలీకృతమైంది. స్వయంగా రాష్ట్రానికి వచ్చి పరిశీలించాకే మీ నిర్ణయాలు చెప్పవచ్చనే భరోసా వారికి కల్పించింది. ముఖ్యంగా విజన్ -2047 ప్రణాళికలు, రాష్ట్ర భవిష్యత్ చిత్రాన్ని చంద్రబాబు, లోకేష్ లు ప్రపంచం ముందు ఆవిష్కరించారు. మంత్రి లోకేష్ రాష్ట్ర వనరులు, అవకాశాలపై ఇచ్చిన ప్రజెంటేషన్ తో, కొన్ని కంపెనీలు, కొందరు సీఈవోలు సంతోషం వ్యక్తం చేశారు. డెన్మార్క్ కు చెందిన ప్రముఖ సముద్ర రవాణా సంస్థ మార్క్స్, ఇంటర్నెట్ థింగ్స్ లో పేరున్న సిస్కో, అతిపెద్ద కెమికల్ కంపెనీ ఎల్జీ కెమ్, మలేషియా కంపెనీ పెట్రోనాస్, పెప్సికో, డీపీ వరల్డ్, హిందుస్థాన్ యూనీలీవర్ సంస్థలు సానుకూలంగా స్పందించాయి. ప్రధానంగా 1.4 లక్షలకోట్ల పెట్టుబడితో ఆర్సెల్లార్ మిట్టల్ సంస్థ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్ అనకాపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ముందుకు రావడం గొప్ప పరిణామం. బిల్ గేట్స్ తో బాబు భేటీ. ముఖ్యమంత్రి చంద్రబాబు బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ బిల్ గేట్స్ తో సమావేశమై.. ఆంధ్రప్రదేశ్ ను ప్రజారోగ్యం, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చడానికి సహకారం అందించాలని ఆయన్ని అభ్యర్థించడం, గేట్స్ సానుకూలత వ్యక్తం చేయడం జరిగింది. పర్యటనలో ప్రఖ్యాత స్విస్ సంస్థ వ్యవస్థాపకుడు, పర్యావరణ వేత్త హండ్రూ హాఫ్ మన్ తో చంద్రబాబు భేటీ, సన్ రైజ్ స్టేట్ ప్రగతికి కొత్త బాటలు వేయనుంది. ప్రత్తిపాటి పుల్లారావు మాజీమంత్రి, శాసనసభ్యులు